![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -368 లో.. ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత మొక్కకి దంపతులిద్దరూ కలిసి నీరు పోస్తుంటారు. ముందుగా కృష్ణ మురారీలు నీరు పోయగా... మీ భర్త ఎక్కడ అని పంతులు గారు ముకుందని అడుగుతాడు. అందరు సైలెంట్ గా ఉండిపోతే కృష్ణ మధ్యలో కలుగుజేసుకొని.. ఇండియా బార్డర్ లో ఉన్నాడని కృష్ణ చెప్తుంది.
ఆ తర్వాత నందు, గౌతమ్, సుమలత, ప్రసాద్ లు కలిసి నీరు పోస్తారు. కాసేపటికి కృష్ణ హారతి ఇస్తు ముకుందకి పట్టుకోమని ఇచ్చి కృష్ణ హారతి తీసుకుంటుండగా.. ఆ హారతి ఆరిపోతుంది. దాంతో కృష్ణ డిస్సపాయింట్ అవుతుంది. అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ముకుంద ఏడుస్తు నా వల్లే ఇదంతా అంటుంది. అనుకోకు నీకేం జరగదని ముకుందతో కృష్ణ అంటుంది. నువ్వేం కంగారు పడకు.. మంచి మనస్సుతో మొక్కుకో అంత మంచే జరుగుతుందని పంతులు గారు ముకుందకి చెప్తాడు. కాసేపటికి భవాని దగ్గరికి రేవతి వచ్చి.. ఇప్పుడు పూజలో ఇలా జరిగిందని బయటపడుతుంది. ఏం కాదులే ఇన్ని రోజులు భ్రమలో ఉండి మనకి మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నామని భవాని అంటుంది. అ తర్వాత అందరు కలిసి భోజనం చెయ్యడానికి వస్తారు. నువ్వు స్పీడ్ గా నడవకు పంచే ఊడిపోతుందని మురారీతో మధు అంటాడు. అంత లేదు.. పంచె కట్టింది కృష్ణ ఊడిపోదంట అనగానే అందరు నవ్వుకుంటారు. కాసేపటికి భవాని తన గదిలో ఫోన్ ని తీసుకొని మురారికి రమ్మని చెప్పగానే.. తను తీసుకొని రావడానికి వెళ్తాడు. కాసేపటికి పంచె ఊడిపోవడం గమనించిన కృష్ణ.. మురారి రాగానే తనకి చెప్తుంది. దాంతో మురారి తినడం అయిపోయిన కూడా లేవడు. అ తర్వాత కృష్ణ అందరికి చెప్పడంతో అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
అ తర్వాత అందరూ సరదాగా గాలిపటాలు ఎగురవేస్తారు.. కాసేపటికి కృష్ణ గదిలోకి వచ్చి.. ఆదర్శ్ ని తీసుకొని వచ్చి ముకుంద జీవితం బాగు చెయ్యలని అనుకుంటుంది. అ తర్వాత మురారి వస్తాడు. మురారి రొమాంటిక్ గా మాట్లాడుతుంటే కృష్ణ సిగ్గు పడుతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ లేచి ముగ్గు వేద్దామని వచ్చేసరికి ముగ్గు వేసి ఉండడంతో ఎవరు వేశారంటు ఇంట్లో అందరిని అడుగుతుంది. తరువాయి భాగంలో కృష్ణ ఎక్కడ అని మురారి మధుని అడుగుతుంటే.. అప్పుడే ముకుంద కృష్ణని బయటనుండి అందంగా రెడీ చేసి తీసుకొని వస్తుంటుంది. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |